Best Face Packs: వర్షాకాలంలో మీ ముఖాన్ని చందమామలా మార్చే ఫేస్‌ ప్యాక్‌లు.. ఓసారి ట్రై చేసి చూడండి!

|

Jul 16, 2024 | 12:26 PM

వర్షాకాలంలో వేలాది చర్మ సమస్యలు చుట్టుముడతాయి. కొన్నిసార్లు దురద, మరి కొన్నిసార్లు ముఖంపై మొటిమల సమస్యలు దాడి చేస్తాయి. ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేం. ఈ కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది రెగ్యులర్‌గా ఫేషియల్స్ చేస్తుంటారు. మరికొంత మంది సహజ ఫేస్‌ ప్యాంకులు ట్రై చేస్తుంటారు. రెండూ ప్రయోజనకరమైనవే..

1 / 5
వర్షాకాలంలో వేలాది చర్మ సమస్యలు చుట్టుముడతాయి. కొన్నిసార్లు దురద, మరి కొన్నిసార్లు ముఖంపై మొటిమల సమస్యలు దాడి చేస్తాయి. ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేం. ఈ కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది రెగ్యులర్‌గా ఫేషియల్స్ చేస్తుంటారు. మరికొంత మంది సహజ ఫేస్‌ ప్యాంకులు ట్రై చేస్తుంటారు. రెండూ ప్రయోజనకరమైనవే.

2 / 5
వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల దుష్ప్రభావాల భయం ఉండదు. మెరిసే చర్మాన్ని పొందడం చాలా సులభం. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓట్స్ బలేగా ఉపయోగపడతాయి. రోజ్ వాటర్, పెరుగు, తేనెతో ఓట్స్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యల నుంచి కాపాడుతుంది.

3 / 5
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారకుండా ఉండటానికి రోజ్ వాటర్‌ను ముల్తానీ మట్టితో కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ముల్తానీ క్లే ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ సమస్యలను తక్షణం దూరం చేస్తుంది. అలాగే మొటిమలు, దద్దుర్లు సమస్యను తొలగించడానికి పసుపు పనిచేస్తుంది. పెరుగు, శెనగపిండితో పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వర్షాకాలంలో చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

4 / 5
మొటిమలు, ముడతలు, దద్దుర్లు వంటి వాటికి పరిష్కారం పొందడానికి తులసి ఆకులను కూడా ఉపయోగించవచ్చు. తాజా తులసి ఆకుల పేస్ట్‌ను రోజ్ వాటర్‌తో కలిపి, అందులో పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖం కడిగేసుకోవాలి.

5 / 5
వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ సహాయం తీసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి ముఖంపై పిచికారీ చేసుకోవాలి. దీనిని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.