భారతీయ వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు రుచి, వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మన వంటకాల్లో ఎక్కువగా వినియోగించే ఈ ఐదు సుగంధ ద్రవ్యాల వల్ల వనగూరే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..
యాలకులు జీర్ణక్రియకు సహాయపడే ఆమ్లాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, కడుపులోని జీర్ణవ్యవస్థను ప్రేరేపించడంలో సహాయపడతాయి.
దంతాల ఆరోగ్యానికి లవంగాలు చేలే మేలు మాటల్లో చెప్పలేనిది.
నల్ల మిరియాలల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచి మొగ్గలకు ఉద్దీపనగా పనిచేస్తాయి. పొట్టలో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో సహాయం చేసి జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.
జలుబును నియంత్రించడంలో దాల్చిన చెక్క పాత్ర కీలకమైనది. డయాబెటిక్, ప్రీ-డయాబెటిక్ రోగుల్లో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలను నిండుగా ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది.