
చాలా మంది తాము నేరుగా చక్కెర తినడం లేదు కదా అని ధీమాగా ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే అనేక ఆహార పదార్థాలలో చక్కెర దాగి ఉంటుంది. మనం పరాఠాలు లేదా స్నాక్స్‌తో తినే టమోటా సాస్ అత్యంత ప్రమాదకరం. కంపెనీలు నో యాడెడ్ షుగర్ అని ప్రచారం చేసినా.. అది వాస్తవం కాదు. మీరు ఒక టీస్పూన్ సాస్ తింటే ఒక టీస్పూన్ చక్కెర తిన్నట్లే లెక్క. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని తక్షణమే పెంచుతుంది.

మనం తాగే పానీయాలు మన శరీరానికి తెలియకుండానే భారీ స్థాయిలో చక్కెరను అందిస్తున్నాయి. కోలా లేదా ఇతర సోడాలు షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా, వాటిలో కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.

పండ్ల రసాలు: పండును నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. కానీ దానిని రసంగా మార్చినప్పుడు, అందులోని పోషకాలు తగ్గి ఫ్రక్టోజ్ శాతం పెరుగుతుంది. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్‌లు తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.

ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ప్రోబయోటిక్స్‌కు మంచి మూలం. కానీ స్ట్రాబెర్రీ, వెనిలా వంటి ఫ్లేవర్లతో వచ్చే పెరుగులో అధిక మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుంది.

ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రకటనల మాయలో పడి ఆరోగ్యకరం అని రాసి ఉన్న ప్రతి ప్యాకెట్‌ను నమ్మకండి. ఆహార పదార్థాల వెనుక ఉండే లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోండి. చక్కెర వాడకాన్ని తగ్గించడం ద్వారా గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.