
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు తాజా రోజా పువ్వు రెక్కలు, అర కప్పు తురిమిన కొబ్బరి , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగలు, నాలుగు ఎండు మిర్చి , 5 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు, రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.

రోజా పువ్వు చట్నీ తయారీ విధానం ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు వేరుశెనగలు, నాలుగు ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు రోజా పువ్వు రెక్కలును కూడా వేసి మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి.

ఈ మిశ్రమాన్ని కిందకు దించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, నిమ్మకాయంత చింతపండు, ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు వేసి దీనిని చట్నీలా చేసుకోవాలి.

ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసి ఆ తాలింపును పచ్చడి మిశ్రమంలో పోయాలి.

అంతే.. వేడి వేడి తంజావూర్ స్టైల్ రోజా పువ్వు చట్నీ రెడీ. దీనిని ఇడ్లీ, దోసెలతో తింటే అదిరిపోతోంది. మీరు కూడా ఈ సారి మీ ఇంట్లో చేసుకుని తినండి. ఒక రోజు చేస్తే రోజూ చేసుకుని తింటారు.