గోరు వెచ్చనినీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే..

01 May 2026

TV9 Telugu

TV9 Telugu

బ‌రువు పెర‌గ‌డం సుల‌భ‌మే. కానీ బ‌రువు త‌గ్గ‌డం అంత సులువేమీ కాదు. 1 కిలో బ‌రువు పెరిగేందుకు 3 రోజులు చాలు. కానీ త‌గ్గేందుకు 10 రోజులు శ్ర‌మించాల్సి ఉంటుంది

TV9 Telugu

బరువు తగ్గేందుకు జిమ్‌లో కసరత్తు చేస్తే సరిపోదు. డైట్ విష‌యంలోనూ తగిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా బ‌రువును త‌గ్గించుకునేందుకు కొన్ని ప్ర‌త్యేక పానీయాలు తాగాల్సి ఉంటుంది

TV9 Telugu

ఇలాంటి పానీయాల్లో నిమ్మ‌కాయ రసం ఒక‌టి. చాలా మంది ఉద‌యం ప‌ర‌గ‌డుపునే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త  నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగుతుంటారు

TV9 Telugu

దీని వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. కానీ నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాల‌ని అనుకుంటున్న వారు ప‌లు సూచ‌న‌లు పాటించాలి

TV9 Telugu

నిమ్మ‌ నీళ్ల‌లో త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి. నిమ్మ‌ నీళ్ల‌ను రోజూ తాగ‌డం చాలా సుల‌భం. సింపుల్ గా నీళ్ల‌ను కాస్త వేడి చేసి అందులో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగేయ‌డ‌మే. రోజుకు 1 లేదా 2 సార్లు తాగితే సరిపోతుంది

TV9 Telugu

ఈ నీళ్ల వ‌ల్ల కేవ‌లం 6 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. అందుక‌నే బ‌రువును త‌గ్గించ‌డం కోసం ఈ నీళ్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. అయితే కొంద‌రు ఈ నీటిలో తేనెకు బ‌దులుగా చ‌క్కెర క‌లిపి తాగుతుంటారు

TV9 Telugu

బరువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ నిమ్మ‌కాయ నీళ్ల‌లో చ‌క్కెర క‌ల‌ప‌కూడ‌దు. అలా క‌లిపి తాగితే బ‌రువు త‌గ్గడానికి బదులు మరింత పెరుగుతారు

TV9 Telugu

కొంద‌రు ఈ నీళ్ల‌లో ఉప్పు క‌లిపి తాగుతారు. ఉప్పును కూడా క‌ల‌ప‌కూడ‌దు. ఎండ‌వ‌ల్ల మీ శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డితే నిమ్మ‌కాయ నీళ్ల‌లో ఉప్పు, చ‌క్కెర క‌లిపి తాగాలి. అంతేకానీ బ‌రువు త‌గ్గ‌డం కోసం ఉప్పు కలపకూడదు