
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ మొబైల్ తయారీ కంపెనీ షియోమీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ బ్రాండ్‌కు అంత పాపులారిటీ వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా షియోమీ 'ఎమ్ ఐ 11' పేరుతో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. అమోఎల్ఈడి ప్యానెల్, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే 108 మెగా పిక్సెల్ (రెయిర్), 20 మెగాపిక్సెల్ (సెల్ఫీ)తో అద్భుతంగా ఫొటోలు తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉండే ఈ కెమెరాతో సినిమాను తలపించే వీడియోలు తీయొచ్చని చెబుతోంది షియోమీ.

ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీని అందించారు. 4,600 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ, 55 వాట్ విత్ వైర్, 50 వాట్ విత్ అవుట్ వైర్ ఛార్జింగ్ దీని సొంతం.