- Telugu News Photo Gallery Technology photos Whatsapp planning to introduce new feature to manage contact from linked device
Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్లు.. ఇకపై ఆ సమస్యకు చెక్..
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల ప్రైవసీకి, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్, దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 23, 2024 | 2:37 PM

ప్రస్తుతం వాట్సాప్‌ను ఒకటికి మంచి డివైజ్‌లలో యూజ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఫోన్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగిస్తూ.. ల్యాప్‌ట్యాబ్ వంటి వాటిని సెకండరీ డివైజ్‌లుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది ఓ సమస్య ఎదుర్కొంటుంటారు.

సాధారణంగా వాట్సప్‌లోని చాట్‌లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

ఇందులో భాగంగానే కాంటాక్ట్ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచరను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఇకపై కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా అవకాశాన్ని తీసుకొస్తున్నారు. కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో వాట్సాప్ యాడ్ చేయాలా.? మొబైల్‌లోనూ యాడ్ చేయాలా.? అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.

ఈ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని సెలక్ట్ చేసుకొని నెంబర్ సేవ్ చేసుకోవచచు. దీంతో ఫోన్ పోయినా, మొబైల్ మార్చినా వాట్సాప్‌లో సేవ్ అయిన నెంబర్స్ అలాగే ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా మళ్లీ నెంబర్స్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఇక వాట్సాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పర్సనల్ అసిస్టెంట్‌కు కొత్తగా చాట్ మెమొరీ ఫీచర్‌ను యాడ్ చేయనున్నారు. దీంతో మీకు సంబంధించిన విషయాలను అది సేవ్ చేసుకొని మీకు సంబంధించిన వివరాలన అందిస్తాయి ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పనిచేస్తున్నారు.




