
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన వివో వై28ఎస్ 5జీ ఫోన్‌పై తాజాగా స్వల్పంగా తగ్గించింది. వివో వై28ఎస్ 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,999, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ ఫోన్ రూ.16,999లకు లాంచ్ చేసింది.

అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌లపై రూ. 500 చొప్పున తగ్గించింది. దీంతో 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,499, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.14,999, 8 జీబీ ర్యామ్ ఫోన్ 16,499లకే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ స్మార్ట్ ఫోన్‌ను వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌తో పాటు.. వివో ఇండియా ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే.. వివో వై28ఎస్ 5జీ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్క్రీన్ సొంతం ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 15 వాట్స్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించార. కనెక్టివిటీ విషయానికొస్తే.. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ తోపాటు 5జీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.