Smartphones: కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి వస్తున్న నయా మాల్‌ ఇదే..

|

Apr 15, 2024 | 9:59 AM

మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ప్రతీ నెల కొంగొత్త స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో తాజాగా మార్కెట్లోకి కొన్ని ఫోన్‌లను వస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్త 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లైతే ఓసారి ఈ కొత్త ఫోన్స్‌ను ఓ లుక్కేయండి. వీటిలో రియల్‌మీ మొదలు వివో వంటి బ్రాండ్స్‌ ఉన్నాయి...

1 / 5
రియల్‌మీ పీ1 సిరీస్‌ ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీన ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. రూ. 15వేలలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే 45 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీని అందించనున్నారు. ఇక పీ1 ప్రో ధర రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనా.

2 / 5
మార్కెట్లోకి వస్తున్న మరో కొత్త ఫోన్‌ మోటొరోలా జీ64 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 16వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ను అందించనున్నారు. అలాగే 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రట్‌ కెమెరాను ఇందులో ఇవ్వనున్నారు.

3 / 5
మోటో జీ64 5జీ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పోన్‌ను 8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు.

4 / 5
ఇదే నెలలో వస్తున్న మరో ఫోన్‌ వివో టీ3 ఎక్స్‌. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 15 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమెరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

5 / 5
ఇక వివో టీ3 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో 44 వాట్స్‌ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు.