ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఎక్కువగా లైక్స్, వ్యూస్ కౌంట్‌ను గమనిస్తుంటారు. ఎవరి పోస్టుకు ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయని తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పక్కవారి పోస్టుల లైక్స్‌ను కూడా తెలుసుకోవాలని భావిస్తుంటారు.
అయితే మీ పోస్టుకు ఎన్ని లైక్స్ వచ్చాయన్న విషయాన్ని ఇతరులకు కనిపించకుండా చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? మీ ఫాలోవర్లకు మీ లైక్స్ కౌంట్, మీ పోస్ట్ ఎన్నిసార్లు షేర్ అయ్యిందన్న కౌంట్ కూడా తెలయకుండా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ఒక చిన్న సెట్టింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ పబ్లిష్ అయిన తర్వాత, పోస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఈ సెట్టింగ్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలంటే.
ముందుగా మీరు చేసిన పోస్ట్ పైన రైట్ సైడ్ కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి లైక్ అండ్ షేర్ కౌంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో హైడ్ లైక్ అండ్ షేర్ కౌంట్స్ బటన్‌ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ పోస్ట్ చేస్తున్న సమయంలోనే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ట్యాగ్ చేసే పేజీలోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ సెటింగ్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే హైడ్ లైక్ అండ్ వ్యూ కౌంట్స్ ఆన్ దిస్ పోస్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ ఫాలోవర్లకు లైక్స్, షేర్స్ కౌంట్ కనిపించకుండా ఉంటుంది.