
ఛార్జర్ విషయంలో జాగ్రత్త : చాలా మంది ఇతర ఫోన్‌ల ఛార్జస్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఒరిజనల్ ఛార్జర్ ఉపయోగిచి మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడం వలన మీ బ్యాటరీ సేఫ్‌గా ఉంటుంది. ఇతర ఫోన్‌ల ఛార్జింగ్ పెట్టడం వలన మీ ఫోన్ బ్యాటరీనాశనం అయ్యే ప్రమాదం ఉన్నదంట.

స్క్రీన్ బ్రైట్‌నెస్ : మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలి. మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా, ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవ్వాలి అంటే, మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే? ఇది మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ పై కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వీలైనంత వరకు డార్క్ మోడ్ ఎక్కువగా ఆన్‌లో ఉంచుకోవడం చాలా మంచిది.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్ : చాలా మంది ఫోన్ లోని యాప్స్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. అయితే మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ యాప్స్ మీరు వాడకపోయినప్పటికీ అవి రన్ అవుతూ ఉంటాయి. దీని వలన ఫోన్ బ్యాటరీ దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన అనవసరమైన యాప్స్ స్టాప్ చేయడం చాలా మంచిది.

సాఫ్ట్ వేర్ అప్డేట్ తప్పనిసరి : మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవ్వాలి అంటే, తప్పకుండా మీ ఫోన్‌ను రెగ్యులర్‌గా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలి. దీని వలన మీ ఫోన్ ఎక్కువగా వర్క్ అవుతుంది. అంతే కాకుండా ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుందంట.

అదే విధంగా బ్లూటూత్, వైఫై, జీపీఎస్ వంటి ఫీచర్స్ ఎప్పుడూ ఆఫ్ లో ఉండేలా చూసుకోవాలి. కొంత మంది తెలియక వాటిని ఆన్ చేసి పెడుతుంటారు. అలాగే ఫోన్ లైవ్ వాల్ పేపర్స్, విడ్జెట్‌ల వాడకం కూడా తగ్గించాలంట.