
ఆధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన సీఎంఎఫ్ ఫోన్ 1 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ ప్యానెల్ కలిగిన 6.67 అంగుళాల స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 6 జీబీ, 8 జీబీ ర్యామీ, 128 జీబీ స్టోరేజీ దీని ప్రత్యేకతలు. ఎక్కువ సమయం పనిచేసేందుకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ 5జీ ఫోన్ కు ఎఫ్ డీడీ ఎన్ 1, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్28తో పాటు టీడీడీ ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్77, ఎన్78 బ్యాండ్లు మద్దతు ఇస్తాయి. కెమెరాకు సంబంధించి వెనుక ప్యానల్ లో 50 ఎంపీ సోనీ సెన్సార్, పోర్ట్రెయిట్ లైన్స్ తో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ను మొదటి రూ.15,999కు విడుదల చేశారు. ఇప్పుడు రూ.15 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

పనితీరు, డిజైన్ పరంగా ఐక్యూ జె10ఎక్స్ 5జీ ఎంతో ఆకట్టుకుంటోంది. హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ కలిగిన 6.72 అంగుళాల విశాలమైన డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 128 జీబీ స్టోరేజీ, 6 జీజీ మరియు 8 జీబీ ర్యామ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 4 నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఫొటో గ్రఫీ కోసం వెనుక 50, 2 మెగా పిక్సల్ కెమెరాలు అమర్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. టీడీడీ ఎన్40, ఎన్77, ఎన్78తో పాటు ఎఫ్ డీడీ ఎన్1, ఎన్3, ఎన్5, ఎన్28 బ్యాండ్లకు మద్దతు ఉంటుంది. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.13,499 మాత్రమే.

పోకో నుండి విడుదలైన ఎం7 ప్రో జీ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా సీపీయూతో పనితీరు బ్రహ్మాండగా ఉంటుంది. 6.67 అంగుళాల ఓలెడ్ ఎఫ్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే తో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 45 డబ్ల్యూకు సపోర్టు చేసే 5110 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ డ్యయల్ రియర్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా అదనపు ప్రత్యేకతలు. దీనితో పాటు 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999.

అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లలో రియల్ మీ 14 ఎక్స్ ఒకటి. ఐపీ 69 రేటింగ్ తో తీసుకువచ్చిన మొదటి ఫోన్ కావడం విశేషం. 6.67 అంగుళాల స్క్రీన్, డైమెన్సిటీ 6300 చిప్ సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50 ఎంపీ డ్యూయల్ కెమెరా అమర్చారు. అలాగే ముందు 8 ఎంపీ కెమెరా ఉంది. దీనిలో రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ కలిగిన మోడల్ రూ.14,999కు, 8 జీబీ ర్యామ్ మోడల్ రూ.15,999కు అందుబాటులో ఉన్నాయి. కాగా..ఈ ఫోన్ బేస్ మోడల్ ను రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు.

మంచి ఫీచర్లతో తక్కువ ధరకు 5 జీ ఫోన్ కావాలనుకునే వారికి రియల్ మీ పీ3ఎక్స్ 5జీ మంచి ఎంపిక. సరికొత్త సీపీయూ, 2.0 జీహెచ్ జెడ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మీడియా టెక్ డైమెన్సిటీ 6400 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని 6.72 అంగుళాల స్క్రీన్ లో విజువల్స్ చాలా చక్కగా చూడవచ్చు. ఫొటోగ్రఫీ కోసం 50 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే 2 మెగా పిక్సల్ ఏఐ కెమెరా అదనపు ప్రత్యేకత. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే బాధ ఉండదు. ఎఫ్ డీడీ ఎన్1, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్ 28తో పాటు టీడీడీ ఎన్ 40, ఎన్41, ఎన్77, ఎన్78 బ్యాండ్లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ రూ.13,999కు అందుబాటులో ఉంది.