
రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ.. గేమింగ్‌ను ఎక్కువగా ఇష్టపడే వారు ఈ ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 19,749గా ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ.. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వెనుకవైపు 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 19,999గా ఉంది.

ఐక్యూ జెడ్7ఎస్ 5జీ.. దీనిలో మీడియా స్నాప్ డ్రాగన్ 695 5జీ మొబైల్ ప్లాట్ ఫారం ఆధారంగా పనిచేస్తుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4,500ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 18,999గా ఉంది.

ఒప్పో ఏ78 5జీ.. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 1,999గా ఉంది.

రెడ్‌మీ నోట్ 12 5జీ.. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 16,999గా ఉంది.

శామ్‌సంగ్ గేలాక్సీ ఎం33 5జీ.. దీనిలో ఎక్సినోస్ 1280 ఆక్టా కోర్ 2.4గిగా హెర్జ్ 5ఎన్‌ఎం ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్‌లో రూ. 16,999గా ఉంది.