లావా బ్లేజ్ 5జీ.. ఈ ఫోన్లో 50ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 8ఎంపీ సెల్ఫీకెమెరా ఉంటుంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ దర రూ. 11,999గా ఉంది.
రియల్‌మీ నార్జో ఎన్55.. ఈ స్మార్ట్ ఫోన్లో వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫేస్ డిటెక‌్షన్, ఆటో ఫ్లాష్, డిజిటిల్ జూమ్, ఆటో ఫ్లాష్ వంటి కెమెరా ఫీచర్లుంటాయి. ఇతర అంశాలను పరిశీలస్తే 6.72 అంగుళాల 90హెర్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లసడిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో రూ. 12,999గా ఉంది.
రియల్‌మీ 9ఐ.. ఈ ఫోన్లో 50ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. హెడ్‌డీ క్వాలిటీతో కెమెరాలు తీయగలుగుతాం. బ్లాక్ అండ్ వైట్ పోర్ట్‌రైట్ కెమెరా ఉంటుంది. సెల్పీల కోసం 16ఎంపీ హెచ్‌డీ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్ల ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్ సెట్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 14,999గా ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్.. దీనిలో వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరా ఉంటుంది. 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 6.4 అంగుళాల ఇన్‌ఫినిటీ యూ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ ప్రాసెసర్ ఉంటుంది. దీని ధర అమెజాన్ రూ. 15,499గా ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ.. ఈ ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6.58 అంగుళాల 120హెర్జ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 4జెన్1 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ. 13,999గా ఉంది.