
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. టెక్నో పోవా 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 29వ తేదీన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈఫోన్‌ను కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే కలర్స్‌లో తీసుకురానున్నారు.

ఇక టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 70 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెచ్‌ఐఓఎస్ 14 వెర్షన్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ధర విషయానికొస్తే రూ. 15వేలలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.