
రెడ్‌మీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మీ నోట్ 12 భారత మార్కెట్లోకి వచ్చేసింది. గురువారం భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

జనవరి 11వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్స్ ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ వెబ్‌సైట్, ఎంఐ హోమ్‌ల్లో ఈ ఫోన్‌లు లభించనున్నాయి. ఈ ఫోన్ ఫీచరల్ విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 12 బేస్ వేరియంట్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇందులో 6.6 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించిన ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. డ్యూయల్ 5జీ సిమ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. రెడ్‌మీ నోట్ 12 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందించారు.

ధర విషయానికొస్తే రెడ్‌మీ 12 రూ. 17,999కాగా రెడ్‌మీ నోట్ ప్రో రూ. 26,999, రెడ్ మీ నోట్ ప్రో+ ధర రూ. 29,999గా ఉంది. ట్రిపుల్ కెమెరా, ష్లాష్ లైట్ డిజైన్‌తో స్టైలిష్ లుక్‌లో ఫోన్‌ను రూపొందించారు.