- Telugu News Photo Gallery Technology photos Redmi Launches New Wireless EarBuds 3 Pro Have Look On Features And Price
Redmi Earbuds 3 Pro: రెడ్‌మీ నుంచి కొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు.
Redmi Earbuds 3 Pro: రెడ్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఇయర్ బడ్స్ 3 ప్రోతో తీసుకొచ్చిన ఈ వైర్ లెస్ ఇయర్ బడ్స్ సెప్టెంబర్ 9 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది..
Updated on: Sep 06, 2021 | 8:13 PM

చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా ఇయర్‌బడ్స్ 3 ప్రోను విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.

అదిరిపోయే ఫీచర్లతో ఉన్న ఈ వైర్ లెస్ ఇయర్ బడ్స్ రూ. 2,999కే అందుబాటులో ఉంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్‌లో అందుబాటులోకి రానున్నాయి.

వీటి ఫీచర్ల విషయానికొస్తే.. క్వాల్ కాం క్యూసీసీ3040 ప్రాసెసర్‌ను అందించారు. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ వీటి సొంతం. టచ్ కమాండ్స్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

ఇయబ్ బడ్స్‌లో 43 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. చార్జింగ్ కేస్ బ్యాటరీ సామర్థ్యం 600 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 7 గంటల ప్లేబ్యాక్‌ను, చార్జింగ్ కేస్ ద్వారా మొత్తం 30 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.

ఈ ఇయర్ బడ్స్ నీటిలో తడిచినా ఏం కాదు.. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందించారు. వీటి బరువు 4.6 గ్రాములుగా ఉంది. కేస్‌తో కలిపితే మొత్తం బరువు 51 గ్రాములుగా ఉంది.





























