ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ తాజాగా రియల్ మీ నార్జో 30 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అనే ఆప్షన్‌ను ఇచ్చారు. దీంతో 5 శాతం ఛార్జింగ్ ఉన్నా 40 నిమిషాల పాటు స్టాండ్ బై వస్తుంది.
6.5 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. మీడియా టెక్ హిలీయో జీ95 ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.
ఇక కెమెరా విషయానికొస్తే 48 మెగా పిక్సెల్ సామర్థ్యంతో కూడిన రెయిర్ కెమరా, 16 మెగా పిక్సెల్‌తో సెల్ఫీ కెమెరాను అందించారు.
30 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్మర్ట్ ఫోన్ సుమారు గంటలో 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 12,499 కాగా, 6 జీబీ ర్యామ్+128 జీబీ రూ. 14,499గా ఉంది.