
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఓ మొబైల్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

రియల్ మీ సీ 20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మొబైల్ తొలి సేల్‌ను ఏప్రిల్ 12, 13వ తేదీల్లో నిర్వహించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ. 6.5 ఇంచుల తెర ఈ మొబైల్ సొంతం.

ఇక ఈ ఫోన్‌లో.. మీడియా టెక్ హిలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. దీంతో సౌకర్యంగా మొబైల్‌ను ఆపరేట్ చేయొచ్చు.

8 మెగాపిక్సెల్‌తో కూడిన ఏఐ కెమెరాను అందించడం ఈ స్మార్ట్ ఫోన్ మరో ప్రత్యేకత. 2జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్ కెపాసిటీని 256 వరకు పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ రూ. 6,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మొదటి 10 లక్షల వినియోగదారులకు రూ. 200 వరకు డిస్కౌంట్ అందించారు.