Poco Pad 5G: తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.. భారత మార్కెట్లోకి పోకో కొత్త ట్యాబ్‌..

|

Aug 20, 2024 | 10:29 AM

ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త ట్యాబ్స్‌ సందడి చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థలన్నీ ట్యాబ్స్‌ను సైతం తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. పోకో ప్యాడ్‌ 5జీ పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేయనుంది. పోకో ప్యాడ్‌ 5జీ పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాబ్‌ను ఆగస్టు 23వ తేదీన భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే పోకో ప్యాడ్ 5జీ ట్యాబ్‌లో 12.1 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ట్యాబ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌ను 256 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేస్తున్నారు.

3 / 5
ఈ ట్యాబ్‌తో పాటు కీబోర్డ్‌, స్టైలప్‌ పెన్ను కూడా అందిస్తున్నారు. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌తో వస్తున్న ఈ ట్యాబ్‌లో 3.5 ఎమ్‌మ్‌తో కూడిన ఆడియో జాక్‌ను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే పోకో ప్యాడ్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 10,000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన శక్తివంతమైన బ్యాటరీని అందిస్తున్నారు. ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.