- Telugu News Photo Gallery Technology photos Oppo launching new smart phone Oppo Find X7 Ultra features and price details
Oppo Find X7 Ultra: ఆ ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.. పూర్తి వివరాలు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొన్ని ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా పేరుతో ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 12, 2024 | 11:03 PM

స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. కెమెరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

రెండు పెరిస్కోప్ కెమెరాలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఫోన్ ఇదేనని ఒప్పో చెబుతోంది. ప్రపంచంలోనే తొలి క్వాడ్ మెయిన్ కెమెరా విత్ హైపర్‌టోన్ ఇమేజ్ ఇంజన్ ఫోన్ ఇదేనని ఒప్పో ప్రకటించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్7తో పాటు ఫైండ్ ఎక్స్7 అల్ట్రాను కూడా ఒప్పో తీసుకొస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో భాగంగా వెనకాల 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన నాలుగు కెమెరాలను అందించనున్నారు.

ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్‌వైటీ-900 సెన్సర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌పై పని చేస్తుంది.

సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. అలాగే ఈ ఫోన్లలో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. పైన్ షాడో, సిల్వర్ మూన్, వ్యాస్ట్ సీ, స్కై కలర్స్‌లో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 70 వేల నుంచి అందుబాటులో ఉండొచ్చని అంచనా.




