Oppo A18: భారత మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 10 వేలలో స్టన్నింగ్ ఫీచర్స్

|

Oct 07, 2023 | 10:26 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థలన్నీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ18 పేరుతో ఈ ఫోన్‌ను శుక్రవారం లాంచ్‌ చేశారు. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌కోసం ప్లాన్‌ చేస్తున్న వారికి ఒప్పో ఏ18 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గత సెప్టెంబర్‌లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

2 / 5
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. గ్లోయింగ్‌ బ్లాక్‌, గ్లోయింగ్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఒప్పో ఏ18 స్మార్ట్ ఫోన్‌లో ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
 ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందంచారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకొచ్చారు.

4 / 5
అక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ఎస్‌సోసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్‌ .3, యూఎస్‌బీ టైప్‌సీ, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

5 / 5
ఇక ఒప్పో ఏ18 స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను అందంచారు. ఇక సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.