Oppo a3 5g: స్పెషల్‌ ఫీచర్‌తో ఒప్పో కొత్త ఫోన్‌.. కింద పడ్డా ఏం కాదంటా..

|

Aug 20, 2024 | 10:58 AM

అధునాతన ఫీచర్లతో కూడిన కొంగొత్త ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఏ3 పేరుతో లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పటో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రక్షాబంధన్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఒప్పో ఏ3 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందించారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఒప్పో ఏ3 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 1604 × 720 పిక్సెల్‌ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో సన్‌లైట్‌లోనూ ఫోన్‌ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

3 / 5
ఇక ఒప్పో ఏ3 5జీ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎస్‌ఓసీ ప్రాసెసరతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొసత్ఏ ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఒప్పో ఏ3 ఫోన్‌లో ప్రత్యేకంగా మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెంట్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌ ఛార్జింగ్‌ చేసిన సమయంలో ఎలాంటి షాక్‌ రాదు. అలాగే.. డ్రాడ్ రెసిస్టెంట్‌ ఫీచర్‌తో తక్కువ ఎత్తులో నుంచి కింద పడినా ఏం కాదు.

5 / 5
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ కలర్స్‌లో తీసుకొచ్చారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్-సిమ్, 5G, వైఫై, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.