
స్మార్ట్‌ఫోన్‌కు పెట్టింది పేరైన వన్‌ప్లస్ బ్రాండ్ తాజాగా మార్కెట్లోకి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ని లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌ను తక్కువ ధరలో తీసుకొచ్చారు.

ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభం కానున్న ఈ ఇయర్‌బడ్స్‌ను వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ధర విషయానికొస్తే రూ. 2,299కి అందుబాటులో ఉంది.

ఈ ఇయర్ బడ్స్‌లో టీడబ్ల్యూఎస్‌లో టైటానియం డైనమిక్ డ్రైవర్స్‌ను అందించారు. 27ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 300ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఫాస్ట్ ఛార్జింగ్ ప్రత్యేక ఫీచర్.

5.2 బ్లూటూత్ వర్షన్, టైప్ సీ పోర్ట్‌ను అందించారు. గేమ్ మోడ్ ఈ ఇయర్ బడ్ ప్రత్యేక ఫీచర్‌గా చెప్పొచ్చు. అలాగే వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్‌ను అందించారు.

కాల్స్ సమయంలో యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో పక్కన వచ్చే ఎలాంటి శబ్ధాలు వినిపించవు. ఫాస్ట్ పెయిర్ ఫీచర్ కూడా ఈ ఇబయర్ బడ్స్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.