Nothing Phone 2a: నథింగ్‌ నుంచి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్ ఫోన్‌.. లాంచింగ్‌ ఆ రోజే..

Updated on: Feb 19, 2024 | 11:32 AM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌కు ఎలాంటి మార్కెట్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో ఈ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్రాండ్‌ నుంచి ఓ మిడ్ రేంజ్‌ ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. నథింగ్ ఫోన్‌ 2ఏ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వచ్చిన నథింగ్ తాజాగా తొలిసారి మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. నథింగ్‌ ఫోన్‌2ఏ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
మార్చి 5వ తేదీ నుంచి నథింగ్ ఫోన్‌ 2ఏ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ యూజర్లకు రూ. 30 వేలలోపే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఫ్రంట్‌లో పంచ్ హోల్ కటౌట్ ఇవ్వనున్నారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

5 / 5
ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివీటీ విషయానికొస్తే.. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూ టూత్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.