Noise ColorFit Pro 3 Alpha: నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. మీ ఒత్తిడిని కూడా చెప్పేస్తుంది..

|

Mar 21, 2022 | 10:20 AM

Noise ColorFit Pro 3 Alpha: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ లాంచ్‌ అయ్యింది. దేశీయ సంస్థ నాయిస్‌ కొత్తగా స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేసింది. నాయిస్‌ కలర్‌ ఫిట్‌ ప్రో 3 అల్ఫ పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌లోని ఫీచర్లపై ఓ లుక్కేయండి...

1 / 5
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ సందడి పెరిగిపోయింది. రోజుకో కొత్త మోడల్‌ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లోకి విడుదలవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశీ ఎలక్ట్రానిక్‌ కంపెనీ నాయిస్‌ కొత్త స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 3 అల్ఫా పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్‌లో అధునాతన ఫీచర్లను అందించారు.

2 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 8,999 కాగా సేల్‌లో భాగంగా రూ. 5,499కే అందుబాటులోకి రానుంది. మార్చి 25న సేల్‌ ప్రారంభం కానున్న ఈ వాచ్‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నాయిస్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.

3 / 5
నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 3 అల్ఫా ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఇన్‌బుల్ట్ మైక్రోఫోన్‌, టీడబ్ల్యూఎస్‌ సపోర్ట్‌ను అందించారు. హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు ఈ వాచ్‌ సొంతం.

4 / 5
ఇందులో 1.69 టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. బ్లడ్‌ ఆక్సిజన్‌ ట్రాకర్‌ ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకర్‌, బాడీ టెంపరేచర్‌తో పాటు ఒత్తిడిని చెప్పే స్ట్రెస్‌ మానిటరింగ్‌ను కూడా ఇందులో ప్రత్యేకంగా అందించారు.

5 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సాకు సపోర్ట్‌ చేయడం మరో విశేషం. నీటిలో 50 మీటర్ల లోతు వరకు వెళ్లగలిగేలా 5 ఏటీఎమ్‌ వాటర్ రెసిస్టెంట్‌ను ఈ వాచ్‌ కలిగి ఉంది. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏడు రోజులు నిరంతరాయంగా నడుస్తుంది.