
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఆకట్టుకునే డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. అలాగే పలు ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రత్యేకంగా అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసే కొన్ని ఫీచర్లను అందించారు. ముఖ్యంగా ఇందులోని 100 ఎక్స్ సూపర్ జూమ్ ఫీచర్ సహాయంతో ఫొటోలను అత్యంత నాణ్యతతో తీసకోవచ్చు. ఈ ఫోన్‌ను డార్కెస్ట్ స్ప్రూస్, పీచ్ ఫజ్, షీర్ బ్లిస్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే మోటో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999కాగా, లాచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

మోటో ఎడ్స్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్ ఎల్‌టీపీఎస్ పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1,220x2,712 పిక్సెల్ రిజల్యూజన్ ఈ స్క్రీన్ సొంతం. 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, HDR10+ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇన్ డిస్‌ప్లేలో అందించారు. ఇక 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 ఎంపీ, 50 ఎంపీ, 50 ఎంపీలతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.