
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరోనా సోకిన వారిలో చాలా మంది శరీరంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గడంతో మృత్యువాత పడుతున్నారు.

ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకుంటూ చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆక్సిజన్ స్థాయిలను చూపించే కొన్ని స్మార్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..

వన్‌ప్లస్ వాచ్: వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ SpO2 మానిటరింగ్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ రూ. 12, 999లకు అందుబాటులో ఉంది.

రియల్‌మి వాచ్ ఎస్: ఈ స్మార్ట్ వాచ్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. సుమారు 15 రోలజు బ్యాటరీ లైఫ్‌ను అందించే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 4,999

హానర్ బ్యాండ్ 5ఐ: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ వాచ్ ధర రూ. 1,199. ఆక్సిజన్ లెవల్స్‌తో పాటు హార్ట్ రేట్‌ను కూడా మానిటరింగ్ చేస్తుంది.

అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2: 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ఆక్సిజన్ మానిటరింగ్‌తో స్లీప్ అండ్ స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 9, 499గా ఉంది.