MotoG13: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో మోటీజీ13 ఒకటి. 128 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 9,999కాగా, జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,499గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Nokia C12 Pro: నోకియా సీ12 ప్రో ధర విషయానికొస్తే 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 6999కాగా 3 జీబీ ర్యామ్ వేరింట్ ధర రూ. 7499గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.3 ఇంచెస్ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Xiaomi Redmi 12C: 64 జీబీ వెర్షన్ ధర రూ. 8,999 కాగా 128 జీబీ వేరియంట్ ధర రూ. 10,999కి అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో హీలియో జీ85 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 6.71 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం. 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Samsung Galaxy F04: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 7499గా ఉంది. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.5 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.