చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ నుంచి మరో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఐకూ 12 పేరుతో లాంచ్ చేయనున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 14ని ఇవ్వనున్నారు. ఇక డిస్‌ప్లేకు ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
1,260x2,800 పిక్సెల్ రిల్యూషన్‌తో కూడిన 1.5K, 144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
అమెజాన్‌తో పాటు ఐకూ ఇ-స్టోర్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకునే అవకాశాన్న కల్పించనున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కస్టర్లకు అందుబాటులోకి రానుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇన్-డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.
కెమెరా వషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 100ఎక్స్ డిజిటల్ జూమ్‌తో కూడిన 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని ఇస్తున్నారు.