
రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ పక్కన మీకు అనేక సైన్ బోర్డులు కనిపిస్తాయి. ఈ అనేక బోర్డులపై స్టేషన్ పేరు రాసి ఉండటం చూసే ఉంటారు. అలాగే మీరు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ పక్కన రకరకాల బోర్డులు కనిపిస్తుండటం చూసే ఉంటారు. అవి ఎందుకు ఉంటాయి..? వాటిపై రాసిన లెటర్స్ ఏంటి ? అనే విషయం మీకు తెలుసా? ఉంది. ట్రాక్ పక్కన మీకు తెలియని కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

C/FA, W/L బోర్డులు తరచుగా రైల్వే ట్రాక్‌ల వెంట అమర్చి ఉంటయి. కానీ, దీని అర్థం ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి ? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

W/L పసుపు కలర్ బోర్డ్‌లో రాసి ఉంటుంది. అంటే విజిల్/లెవల్ క్రాసింగ్ అని అర్థం. అంటే విజిల్/గేట్.

పసుపు బోర్డుపై C/F , W/L రాసినవి రైలు లోకో పైలట్ కోసం. లోకో పైలట్ ఈ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అతను రైలు హారన్ మోగించాలని ఈ సైన్ బోర్డు లోకో పైలట్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఈ బోర్డు సాధారణంగా రైల్వే క్రాసింగ్‌కు 250 నుండి 300 మీటర్ల వరకు ఈ సైన్ బోర్డులు అమర్చబడి ఉంటుంది.

ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్‌లో భారతదేశం నాల్గవ స్థానంలో, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు 68 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి.