Huawei watch gt 4: 32 జీబీ ర్యామ్‌తో స్టన్నింగ్ స్మార్ట్‌వాచ్‌.. హువాయ్‌ వాచ్‌4 ఫీచర్స్‌ చూస్తే..

|

Aug 19, 2024 | 2:00 PM

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడిన వాచ్‌తో ఇప్పుడు చేయలేని పని అంటూ లేదు. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హువాయు భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. హువాయి వాచ్‌ జీటీ4 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హువాయు భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. హువాయి వాచ్‌ జీటీ4 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫీచర్లను తీసుకొచ్చారు.

2 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో 32 జీబీ ర్యామ్‌ను అందించడం విశేషం. దీంతో వాచ్‌ చాలా వేగంగా పనిచేస్తుంది. హువాయి వాచ్‌ జీటీ 4 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 466 × 466 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఈ వాచ్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో రూపొందించారు. ఈ వాచ్‌లో యాక్సిలరోమీటర్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్‌తో పాటు గైరోస్కోప్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో బేరోమీటర్ సెన్సార్, టెంపరేచర్‌ సెన్సార్‌ను ఇందులో ఉంచారు.

4 / 5
బ్లూటూత్ కాలింగ్‌ పీచర్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌, మైక్రో ఫోన్‌ను ఇచ్చారు. ఇక ఈ వాచ్‌లో 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని అందిస్తున్నారు. ఈ వాచ్‌లో 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో ఈ వాచ్‌ 50 మీటర్ల లోతైన నీటిలో కూడా పనిచేస్తుంది.

5 / 5
ఆండ్రాయిడ్‌ 8.0 వెర్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐఓఎస్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు పోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ పొడవు 46 mm, వెడల్పు 46 mm, మందం 10.9 mmగా రూపొందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ వాచ్‌ రూ. 14,999గా నిర్ణయించారు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు.