
ఇప్పుడు లోన్ కావాలంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇట్టే పని అయిపోతుంది. అయితే కొన్ని రకాల లోన్ యాప్స్ అధిక వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న వార్తలు వినే ఉంటాం. ఈ క్రమంలోనే ప్రముఖ పేమెంట్ సర్వీస్ గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

గూగుల్ పే యూజర్లు యాప్ ద్వారానే ఏకంగా రూ. 8 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎమ్‌ఐ విధానంలో చెల్లించే వెసులుబాటును కల్పించింది.

రుణం పొందడానికి కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎలాంటి పేపర్ వర్క్ కూడా అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్‌లో యాప్ ద్వారానే లోన్ అప్లై చేసుకోవచ్చు. అయితే సిబిల్ స్కోర్ కచ్చితంగా బాగుండాలి.

ఇక ఈ రుణం పొందడానికి ముందుగా యూజర్లు.. గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అనంతరం ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, మేనేజ్ యువర్ మనీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే లోన్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు అవసరమైన అమౌంట్ వివరాలు అందించాలి.

అనంతరం అప్లై నౌ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. చివరిగా కొత్త పేజ్‌లో లోన్ వివరాలను తెలుపుతుంది. అంతే ఓకే అయ్యాక వెంటనే మీరు ఇచ్చిన అకౌంట్‌లోకి లోన్ అమౌంట్ యాడ్ అవుతుంది. లోన్‌పై 13.99 శాతం వడ్డీరేటు ఉంటుంది. 6 నెలల నుంచి 4 ఏళ్ల వరకు లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు.