Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌.. గాలి నాణ్యతను చెప్పేస్తుంది

గూగుల్ మ్యాప్స్‌కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న గూగుల్ తాజాగా మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏక్యూఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఉపయోగాలు ఏంటి.? ఇంతకీ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 14, 2024 | 1:56 PM

ప్రస్తుతం వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారుతోంది. పెద్దపెద్ద పట్టణాల్లో మాత్రమే కాకుండా. చిన్న పట్టణాల్లో సైతం వాయు కాలుష్యం ఎక్కువుతోంది. అయితే ఏ ప్రదేశంలో ఎంత గాలి నాణ్యత ఉందన్న విషయం తెలుసుకునేందుకు మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

1 / 5
ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ను తెలుసుకునేందుకు ఈ కొత్త ఫీచర్‌ ఎంతో దోహదదపడుతుంది. గాలి నాణ్యతను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ను వారం రోజుల్లోగా 100కుపైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్‌ ప్రకటించింది.

2 / 5
మ్యాప్స్‌లో ఏక్యూఐ రీడింగ్‌లు అందరికీ సులభంగా అర్థమయ్యే ఫార్మాట్‌లో ఉంటాయని గూగుల్ తెలిపింది. ఏక్యూఐ 0 నుంచి 50 లోపు ఉంటే ఆరోగ్యానికి మంచిది. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైన స్థాయిగా, 101-200 మధ్య ఉంటే మితమైన స్థాయిగా నిర్ణయించారు.

3 / 5
ఒకవేళ ఏక్యూఐ ఇండెక్స్‌ 201-300 వరకు ఉంటే హానికర స్థాయిగా, 301-400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా, 401-500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు.

4 / 5
ఇక మ్యాప్స్‌లో ఏక్యూఐ ఇండెక్స్‌ను తెలుసుకోవాలంటే ముందుగా మ్యాప్స్‌లోకి వెళ్లాలి. అనంతరం లేయర్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి, ఎయిర్‌ క్వాలిటీ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసిన ప్రదేశంలో గాలి నాణ్యతను చెక్‌ చేసుకోవచ్చు.

5 / 5
Follow us