Google Wallet: భారత్‌లోకి గూగుల్ వ్యాలెట్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే..

|

May 12, 2024 | 6:59 PM

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ వ్యాలెట్‌ పేరుతో సేవలను ఇతరదేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గూగుల్‌ ఈ సేవలను భారత్‌లో లాంచ్‌ చేశారు. భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్‌ వ్యాలెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ గూగుల్‌ వ్యాలెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి.? అసలు దీని ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
గూగుల్ వ్యాలెట్ సేవలు ఇండియాలోని ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్‌లోని పలు బ్రాండ్స్‌తో ఒప్పందం చేసుకున్నారు.

2 / 5
ప్లేస్టోర్‌లో గూగుల్‌ వ్యాలెట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందొచ్చు. అయితే ఈ యాప్‌లో ప్రస్తుతానికి డెబిట్‌ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ డిటెయిల్స్‌ సేవ్ చేసుకునే ఫీచర్ మాత్రం అందుబాటులో లేదు.

3 / 5
ఈ వ్యాలెట్‌ ఫీచర్ల విషయానికొస్తే మీరు ఒకవేళ సినిమా టికెట్‌ బుక్‌ చేశారనుకుంటే వెంటనే ఆ ఈ టికెట్ను గూగుల్ వ్యాలెట్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యాలెట్‌తో మెట్రో టికెట్స్‌ను సైతం బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ మెట్రో, కొచ్చి మెట్రోతో పాటు అబిబస్‌‌ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.

4 / 5
వీటితో పాటు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో వంటి సంస్థలకు చెందిన ఎయిర్‌ టికెట్స్‌ను ఈ యాప్‌తో బుక్‌ చేసుకోవచ్చు. ఈ పాస్‌లను వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు.

5 / 5
ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే సమయంలో వచ్చే రివార్డ్‌ పాయింట్స్‌ను ఈ వ్యాలెట్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్స్‌ని రిట్రీవ్ చేసుకునే ఫీచర్‌ను సైతం అందించారు. కాగా గూగుల్‌ వ్యాలెట్‌లో ఎలాంటి లావాదేవీలు చేసుకోవడానికి వీలు ఉండదు. ఇందుకు గూగుల్ పే మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.