
దుబాయ్ అటే మనకు ఇప్పటి వరకు చమురు ఉత్పత్తి, పర్యాటక రంగాలు గుర్తొస్తాయి. అయితే ఈ దేశం తాజాగా అంతరిక్ష రంగంలో దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.

దుబాయ్ తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరిచేందుకు అంతరిక్ష పరిశోధన వ్యాపారంలో వేగంగా విస్తరించాలని ప్రణాళికగా పెట్టుకుంది.

ఇందులో భాగంగానే చంద్రుడిపైకి రోవర్ను పంపించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జపాన్తో జతకడుతోంది.

జపాన్‌కు చెందిన మ సంస్థ మూన్ రీసెర్చ్ సంస్థ ఐస్పేస్ తో కలిసి రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం తెలిపింది.

భవిష్యత్‌లో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికే యూఏఈ అంతరిక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

చమురు ఉత్పత్తిలో ప్రపంచాన్ని శాసిస్తోన్న దుబాయ్.. అంతరిక్ష రంగంలో ఏమేర రాణిస్తుందో చూడాలి. 2022లో ఈ రోవర్‌ను పంపించనున్నారు.