
ఏసర్ అస్పైర్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల స్క్రీన్, 512 జీబీ హార్డ్ డ్రైవ్,16 జీబీ ర్యామ్‌తో పని చేస్తుంది. విండోస్ 11 ఆధారంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌పై అనేక ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.57, 900గా ఉంది.

ఎంఎస్‌ఐ మోడల్ 14 ల్యాప్‌టాప్ 30 శాతం తగ్గింపుతో లభిస్తుంది. క్లాసిక్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉండే ఈ ల్యాప్ 36 సెంటీమీటర్ స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంది. అలాగే ఐ 7 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్ 16 జీబీ ర్యామ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా గేమర్ల కోసం ఈ ల్యాప్‌టాప్ అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.54,990గా ఉంది.

ఏసస్ వివో బుక్ 16 ఎక్స్‌పై అమెజాన్‌లో ప్రస్తుతం 34 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 40.64 సెంటీమీటర్ల స్క్రీన్ పరిమాణంతో పాటు 16 జీబీ+ 512 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. విండోస్ 11 హోమ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో పని చేసే ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ యాంటీ గ్లేర్ కోటింగ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.57,390గా ఉంటుంది.

డెల్ వోస్ట్రో ల్యాప్‌టాప్ 14 అంగుళాల స్క్రీన్‌తో సిల్వర్ కలర్ ఫినిషింగ్‌తో వస్తుంది. 512 జీబీ హార్డ్ డిస్క్, 16 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఐ5 ఆధారంగా పని చేస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో వస్తుంది. తక్కువ-కాంతి పరిస్థితుల్లో టైప్ చేయడానికి బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో పాటు ఈ డెల్ ల్యాప్‌టాప్ అమెజాన్ సేల్‌లో రూ.59,900కు సొంతం చేసుకోవచ్చు.

హెచ్‌పీ 15 ఎస్ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 39.6 సెంటీమీటర్ స్క్రీన్, నేచురల్ సిల్వర్ కలర్‌లో ఉండే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ +512 జీబీ వేరయింట్‌లో లభిస్తుంది. ఐ3 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11కు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే, యాంటీ-గ్లేర్ టెక్నాలజీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.38,990కు కొనుగోలు చేయవచ్చు.