మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన చైనాకు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలో సత్తా చాటుతున్నాయి.
తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది.
వన్‌ప్లస్ 40 వై 1 పేరుతో విడుదల చేసిన ఈ 40 ఇంచెస్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ధరను రూ. 21,999గా నిర్ణయించారు. 40 ఇంచెస్ టీవీ ఇంత తక్కువ ధరకు, అందులోనూ వన్‌ప్లస్ వంటి బడా బ్రాండ్ నుంచి రావడం విశేషం.
మే 26న భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ధర సుమారు రూ. రెండు వేలకుపైగా తగ్గనుంది.
ఆండ్రాయిడ్ ఓఎస్‌తో నడిచే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్ కూడా అందుబాటులో ఉంటుంది.