కరోనా కలకలం తర్వాత ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ విధానంలోనూ పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్నో వీడియో కాలింగ్ యాప్స్, వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే సమయంలో ఓ సమస్య ఉంది.
వీడియో కాల్‌లో మాట్లాడే సమయంలో బ్యాగ్రౌండ్ సరిగా లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికే 'గూగుల్ మీట్'లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఆప్షన్ ద్వారా మీరు కూర్చున్న బ్యాగ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం గూగుల్ మీట్ ఓపెన్ చేశాక.. కుడిచేతి వైపు కింది భాగంలో కనిపించే మూడు చుక్కలతో కూడిన ఐకాన్ వద్ద క్లిక్ చేసి Customize and Control అనే విభాగంలోకి వెళ్లాలి. అనంతరంTurn on background blur అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
మీటింగ్‌లో పాల్గొనక ముందే meet.google.com అనే విభాగంలోకి వెళ్లి మీరు పాల్గొనాలని అనుకుంటున్న మీటింగ్ సెలెక్ట్ చేసుకుని, ప్రివ్యూ స్క్రీన్‌లో కుడి చేతి వైపు అడుగున, Turn on background blur అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ప్రస్తుతం కేవలం డెస్క్‌టాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే స్మార్ట్ ఫోన్ యాప్‌లోకి కూడా తీసుకురానున్నారు.