Asus ROG Phone 8: అసుస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..

|

Jan 08, 2024 | 12:10 PM

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం అసుస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అసుస్‌ రాగ్‌ ఫోన్‌ 8 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తొలుత ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జనవరి 8వ తేదీన ఆవిష్కరించి, ఆ తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5
 ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం అసుస్‌.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. అసుస్ రోగ్ ఫోన్‌ 8 సిరీస్‌ పేరుతో త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అసుస్‌ రోగ్‌ ఫోన్‌8, అసుస్‌ రోగ్‌ ఫోన్‌ 8 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు. తొలుత రోగ్‌ 8ని తీసుకురానున్నారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ఇవ్వనున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో మోడల్ హెచ్డీఆర్10, 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

3 / 5
ఈ రెండు ఫోన్‌లలోనూ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 24 జీబీ ర్యామ్ విత్ వన్‌ టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీతో ఈ ఫోన్‌లు రానున్నాయని సమాచారం.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే వీటిలో 50 మెగాపిక్సెల్స్‌, 13 మెగాపిక్సెల్‌, 32 మెగాపిక్సెల్స్‌తో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారని సమాచారం. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
ఛార్జింగ్ విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లోనూ క్విక్‌ ఛార్జ్‌ 5.0 అండ్‌ పీడీ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్స్‌లో 5500 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు.