షావోమీ ఎక్స్ 4కే డాల్బీ విజన్ సిరీస్ స్మార్ట్ గూగుల్ టీవీ.. ఈ టీవీ స్క్రీన్ పరిమాణం 138సెంటీమీటర్లు(55 అంగుళాలు) ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్డీ(3840 x 2160) రిజల్యూషన్ ఉంటుంది. హెచ్డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్ ఉంటుంది. గూగుల్ టీవీ ఫీచర్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, బ్లూటూత్, వైఫై, డాల్బీ ఆడియో 20 వాట్ల స్పీకర్లు ఉంటాయి. స్లిమ్, మోడ్రన్ బెజెల్ లెస్ డిజైన్ ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 38,999గా ఉంది.