
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షావోమీకి చెందిన స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్‌లో ఈ టీవీపై ఊహకందని తగ్గింపు ధర అందిస్తున్నారు. షావోమీ 43 ఇంచెస్ టీవీ అసలు ధర రూ. 42,999గా ఉంది.

అయితే ఈ టీవీపై ఏకంగా 49 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 21,999గా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 20 వేలలోనే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 4కే రిజల్యూషన్‌తో కూడిన 24 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

ఈ టీవీ నెట్‌ఫికల్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా, సోనీలివ్, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ టీవీలో 30 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో సిస్టమ్‌ను అందించారు.

షావోమీ టీవీలో 360 డిగ్రీ రిమోట్ కంట్రోల్, ఈజీ కనెక్టివిటీ, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్లేజ్ లెస్ డిజైన్‌తో రావడంతో ఈ టీవీ స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది.