- Telugu News Photo Gallery Technology photos Amazon offering 46 percentage discount on AIR Falcon Series Notebook/Laptop check here for full details
AIR Falcon Series: ఇది కదా ఆఫర్ అంటే.. రూ. 55 వేల ల్యాప్‌టాప్ రూ. 28 వేలకే
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సీజన్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ల్యాప్‌టప్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. ఎయిర్ ఫాల్కాన్ సిరీస్ ల్యాప్‌టాప్‌పై భారీ సేల్ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 11, 2024 | 2:20 PM

ఎయిర్ ఫాల్కన్ సిరీస్ నోట్‌బుక్/ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో మంచి ఆఫర్ లభిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై ఏకంగా 46 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 54,990కాగా అమెజాన్ సేల్‌లో 46 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో దీనిని కేవలం రూ. 29,769కే లభిస్తోంది. డిస్కౌంట్ ఇక్కడితోనే ఆగిపోలేదు. అదనంగా బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1750 డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌లో 14.1 ఇంచెస్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను అందించారు. కోర్ ఐ3 1215యూ సీపీయూ మోడల్‌ను ఇందులో అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్‌ను అందించారు. అలాగే ఇంటెల్ యూహెచ్‌డీ కో ప్రాసెసర్ గ్రాఫిక్స్‌ను ఇచ్చారు. ఇందుఓ 65 వాట్స్ టైప్ సీ పోర్ట్‌కు సపోర్ట్ చేఏ 4000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

512 జీబీ ఇంటర్నల్ మెమోరీతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ల్యాప్‌టాప్ బరువు 1.4 కిలోలుగా ఉంది.




