- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on OnePlus 12 smart phone, check here for full details
OnePlus 12: వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై మంచి డీల్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఫోన్‌పై మంచి ఆఫర్ లభిస్తోంది. వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 10, 2024 | 9:50 PM

వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్ అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 64,999కాగా అమెజాన్‌లో ఏకంగా రూ. 5,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ పోన్‌ను రూ. 59,500కి సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు ఇక్కడితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా భారీగా డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు. ఈ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ProXDR డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌కు ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది.

ఇందులో యాప్ లాక్, హైడ్ యాప్‌ల వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఇన్‌బిల్ట్‌గా అందించారు. నాలుగేళ్ల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లను, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సోపర్ట్ చేసే 5400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. వేగంగా ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.




