Black Pepper: సీజనల్ వ్యాధుల అంతు చూసే నల్ల మిరియాలు.. ఎలా తీసుకోవాలంటే?

|

Oct 29, 2024 | 12:46 PM

చాలా వ్యాధులకు నివారణ మార్గాలు వంటింట్లోనే ఉంటాయి. అయితే వాటిని ఎలా వాడాలో తెలియక ప్రతి సారీ డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటాం. మీకు తెలుసా సీజనల్ వ్యాధుల నివరణలో నల్ల మిరియాలు బలేగా పనిచేస్తాయి. వీటిని ఎలా వాడాలో తెలిస్తే మందులతో పనే ఉండదు..

1 / 5
మారుతున్న వాతావరణం కారణంగా ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
ఇలాంటి సీజనల్ వ్యాధులకు నల్ల మిరియాలు ఔషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

3 / 5
చలికాలంలో మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మిరియాలు తినడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
బరువు తగ్గడంలోనూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా ఊబకాయంతో సతమతమవుతున్నట్లయితే, దాన్ని తగ్గించుకోవడానికి మిరియాలు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

5 / 5
కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారంలో మిరియాలు చేర్చుకోవడం మంచిది. మిరియాలు కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వీటిల్లోని యాంటీ-అలెర్జిక్, ఆర్థరైటిక్ గుణాలు నొప్పి, మంటను తగ్గిస్తాయి.