Telugu News Photo Gallery Sun Tan Removal Tips: How To Remove Sun Tan Naturally Using Simple Home Remedies, know here
Sun Tan Removal Tips: ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. సహజంగా స్కిన్ ట్యాన్ వదలిపోతుంది
ఎండా, దుమ్మూ-ధూళి కారణంగా చర్మం పై నల్లగా ట్యాన్ పేరుకుపోతుంటుంది. ప్రతిసారి ఫుల్ స్లీవ్ బట్టలతో బయటికి వెల్లడం కుదరదు. దీంతో ముఖం చేతులు, మెడ, కాళ్ల భాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అందుకే బటయకు వెళ్లేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా తీసుకుకెళ్లాలంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోకూడదు..
పాలతో చర్మ కాంతిని పెంచుకోవచ్చు. 2 చెంచాల పాలకు 1 చెంచా తేనె, 2 చెంచాల నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మానికి తేమను పునరుద్ధరిస్తుంది.
ఎండా, దుమ్మూ-ధూళి కారణంగా చర్మం పై నల్లగా ట్యాన్ పేరుకుపోతుంటుంది. ప్రతిసారి ఫుల్ స్లీవ్ బట్టలతో బయటికి వెల్లడం కుదరదు. దీంతో ముఖం చేతులు, మెడ, కాళ్ల భాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అందుకే బటయకు వెళ్లేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా తీసుకుకెళ్లాలంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోకూడదు.
అయితే ఇలా ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా ట్యాన్‌ను నివారించడం ఒక్కోసారి కష్టసాధ్యమవుతుంది. చర్మం తిరిగి సహజ మెరుపు సంతరించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ముందుగా ఓ గిన్నెలో శెనగపిండి, పుల్లటి పెరుగు, చిటికెడు పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం, మెడ భాగాలకు అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇది టాన్ని తొలగించడంతో పాటు జిడ్డును నియంత్రిస్తుంది.
బంగాళాదుంప జ్యూస్ స్కిన్ ట్యాన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది. బంగాళాదుంప పేస్ట్ తయారు చేసి రసాన్ని వడకట్టుకుంటే బంగాళదుంప రసం వస్తుంది. దీనిలో తేనెతో మిక్స్ చేసి చర్మంపై అప్లై చేసి, 10-15 నిమిషాల పాటు ఉంచుకుని, గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఆ తర్వాత మర్చిపోకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
పాలతో చర్మ కాంతిని పెంచుకోవచ్చు. 2 చెంచాల పాలకు 1 చెంచా తేనె, 2 చెంచాల నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మానికి తేమను పునరుద్ధరిస్తుంది.
మొండి మచ్చలను సైతం తొలగించడంలో టమోటాలు ప్రభావ వంతంగా పనిచేస్తాయి. టమోటాలు పేస్ట్ చేసుకుని చిటికెడు పసుపు కలిపి చర్మానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం సహజ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది.