AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి Vs పుచ్చకాయ.. సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచేందుకు ఏది బెస్ట్‌! ఏది ఎప్పుడు తినాలి!

వేసవి కాలం రాగానే ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల పండ్లను, జ్యూస్‌లను తాగేందుకు ఇష్టపడుతారు. అందులో మామిడి, పుచ్చకాయ అత్యంత ప్రజాదరణ పొందినవి. ఈ రెండు పండ్లు వేర్వేరు పోషక విలువలను, శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తాయి. అయితే ఇక్కడ చాలా మందిలో ఉన్న సందేహం ఏమిటంటే రెండింటిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఏది ఉత్తమైనది అని. కాబట్టి ఈ ప్రశ్నకు సమాదానం మనం ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: May 13, 2026 | 7:08 AM

Share
హైడ్రేషన్: సమ్మర్‌లో అధిక వేడి వల్ల మనం త్వరగా నీరసించి పోతాం. ఈ సమయంలో మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.ఈ క్రమంలో శరీరానికి నీటిని అందించే విషయంలో పుచ్చకాయ మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో సుమారు 90 శాతం నీరు ఉంటుంది, ఇది ఎండకాలంలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. మామిడి పండులో నీటి శాతం తక్కువగా ఉండి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. తక్షణ ఉపశమనం, చలువ కోసం పుచ్చకాయ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

1 / 5
శక్తి, పోషక విలువలు: మామిడి పండులో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో విటమిన్ A, C మెండుగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మరోవైపు, పుచ్చకాయ చాలా తేలికగా ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

2 / 5
జీర్ణక్రియపై ప్రభావం: ఈ రెండు పండ్ల జీర్ణక్రియ తీరు వేర్వేరుగా ఉంటుంది. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది అలాగే కడుపుకు తేలికగా అనిపిస్తుంది. ఇది తిన్న వెంటనే ఎటువంటి భారంగా అనిపించదు. కానీ మామిడి పండు తిన్నప్పుడు అది కొంచెం భారంగా అనిపించవచ్చు. అందుకే వేసవిలో జీర్ణక్రియ సాఫీగా ఉండాలంటే పుచ్చకాయ ఒక మంచి ఎంపిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
మితంగా తినడం: అయితే మామిడి పండు రుచిగా, పోషకదాయకంగా ఉన్నప్పటికీ, వేసవిలో దీనిని అతిగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతమందిలో అసౌకర్యాన్ని కలిగించ్చ వచ్చని..అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకోవడం, పగటిపూట మాత్రమే తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ తాజాగా ఉన్నప్పుడు మాత్రమే దానిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

4 / 5
సరైన పండును ఎంచుకోవడం: ఈ రెండు పండ్లు మన శరీరంలో వేడి తగ్గించగలవు. అయితే రెండింటిలో ఏది ఉత్తమమైనది అనేది మాత్రం మీ అవసరాన్ని బట్టి మారుతుంది. మీకు కేవలం దాహం తీరాలి, శరీరం చల్లబడాలి అంటే పుచ్చకాయను ఎంచుకోండి. ఒకవేళ మీకు శక్తి కావాలి, కడుపు నిండుగా ఉండాలి అనుకుంటే మామిడి పండును ఎంచుకోండి. ఈ రెండింటి ప్రయోజనాలను అర్థం చేసుకుని తీసుకోవడం ద్వారా వేసవిని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

5 / 5
Follow Us