
బియ్యం నీరు : బియ్యం నీటిలో ఉండే ఇనోసిటాల్, విటమిన్ బి మరియు అమైనో ఆమ్లాలు జుట్టుకు ప్రాణం పోస్తాయి. బియ్యాన్ని కడిగి ఆ నీటిని 24 గంటల పాటు నానబెట్టండి. పులిసిన ఈ నీటిని షాంపూ చేసిన తర్వాత జుట్టుకు పట్టించి కడిగేయండి. మొదటి వాడకంతోనే జుట్టు మెరవడం మీరు గమనిస్తారు.

ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తాయి. ఉల్లిపాయను తురిమి రసం తీయండి. ఆ రసాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా సహజమైన మెరుపును ఇస్తుంది.

అరటిపండు హెయిర్ మాస్క్: పొడిబారిన జుట్టుకు అరటిపండు ఒక గొప్ప కండిషనర్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ బి6 జుట్టుకు తేమను అందిస్తాయి. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, అందులో ఒక స్పూన్ తేనె కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత స్నానం చేయండి. మీ జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

మందార పువ్వులు: మందార పువ్వులు, ఆకుల్లో ఉండే అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ సి జుట్టు చిక్కుపడకుండా చూస్తాయి. మందార పువ్వులు, ఆకులను నూరి పేస్ట్‌లా చేయండి. దీనిని తలకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

తేనె - పెరుగు: తేనెలోని యాంటీఆక్సిడెంట్లు, పెరుగులోని పోషకాలు జుట్టును మృదువుగా ఉంచుతాయి. ఒక గిన్నెలో తేనె, కొద్దిగా నీరు మరియు పెరుగు కలిపి పేస్ట్‌లా చేయండి. దీనిని 20 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి కడిగేయండి. మార్కెట్లో దొరికే కండిషనర్ల కంటే ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది.