
సాధారణంగా, మహిళలు స్నానం చేసిన తర్వాత చేసే మొదటి పని వారి జుట్టును టవల్‌లో తుడుచుకోవడం. కొంతమంది హెయిర్ డ్రయర్‌తో జుట్టును ఆరబెట్టుకుంటే.. మరికొందరు టవాల్‌తో జుట్టును తుడుచుకొని.. ఆ టవాల్‌ను అలాగే జుట్టుకు చుట్టుకుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జుట్టుకు మేలు చేసే పదార్ధాల్లో ఉసిరి ముందు వరుసలో ఉంటుంది. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు బ్రేక్: మీరు మీ జుట్టును టవాల్‌తో గట్టిగా చుట్టి ఉండచం వల్ల అది మీ తలలోని నీటిని పీల్చుకుంటుందనేది నిజమే, కానీ అదే సమయంలో, అది మీ జుట్టును మరింత పొడిగా చేస్తుందని మీరు తెలుసుకోవాలని. దీని వల్ల జుట్టు పెరుగుదల నిలిచిపోయే అవకాశం ఉంది.

జుట్టు ఆకారం మారుతుంది: స్నానం చేసిన తర్వాత మీ జుట్టును టవల్‌లో చుట్టుకుంటే, మీ జుట్టు ఆకారం పూర్తిగా మారుతుంది. అంటే మీ స్ట్రెయిట్ హెయిర్ మొత్తం చెల్లాచెదురుగా, రింగులు రింగులుగా మారుతుంది. దానితో పాటు డ్యాండ్రప్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

జుట్టు సంరక్షణకు ఖరీదైన రసాయనాలతో కూడిన ఉత్పత్తులను పూయడానికి బదులుగా ఇంటి నివారణలను ప్రయత్నించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జుట్టు బాగా, అందంగా పెరగడానికి సహాయపడుతుంది.