
పచ్చిగా, తాజా మొలకలు తింటే పోషకాలు శరీరానికి అందుతాయి, ఇంకా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పొడి విత్తనాలను నేరుగా తినడం కష్టం కాబట్టి, వాటిని నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత తీసుకోవడం వల్ల అవి మెత్తబడి, నమలడానికి మంచిగా ఉంటాయి.

రెండు ఎండు గింజలలోని పోషకాలు ఒక మొలకెత్తిన గింజకు సమానమవుతాయి.అందుకే మొలకలెత్తిన విత్తనాలను వజ్ర సమానంతో చెబుతారు. ఇతర ఆహారాలు రాగి, వెండి, బంగారం వంటివైతే, మొలకలు వజ్రాలని నిపుణులు అంటున్నారు. ఈ మొలకలకు వాటికవే సాటి, పోటీ ఇంకోటి ఏవి కూడా ఉండవు. అయితే, ఏ రకాల మొలకలు తినాలి, ఎంత పరిమాణంలో తినాలో ఇక్కడ చూద్దాం..

తక్కువ సమయంలో తినడానికి, నోటికి రుచిగా ఉండటానికి వీలుగా ఉండే మొలకలను ఎంచుకోవాలి. అలసందలు (బొబ్బర్లు), శెనగలు ఈ రెండు రకాల గింజలు ఆరోగ్యానికి మంచివో. ఈ మొలకలు నమలడానికి కూడా మెత్తగా ఉండటంతో పాటు రుచికరంగా ఉంటాయి . అలాగే వీటితో పాటు గోధుమలు, సజ్జలు, ఉలవలు, రాగులు, జొన్నలు వంటి రకాల మొలకలను కూడా తీసుకోవచ్చు.

ఈ మొలకలలో పిండి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల కడుపుకు హాయిగా ఉంటుంది. మొలకలు పొడవుగా వచ్చినప్పుడే వాటిలో పోషకాలు జీర్ణక్రియ సులువు అవుతుందని, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా మొలకలు వలన శరీర బలం, గ్యాస్ వంటి సమస్యలు కూడా పోతాయి. ఒక గుప్పెడు మొలకలను తింటే మంచి పోషకాలు లభిస్తాయి.

80-100 గ్రాముల ఎండు గింజలను నీటిలో నానబెట్టి ఒక పొడి వస్త్రంలో కట్టుకుంటే మంచి పరిమాణంలో మొలకలు వస్తాయి. గ్యాస్ సమస్యలు, అరుగుదల తక్కువగా ఉన్నవారు వాటిని బాగా నమిలి, ఎక్కువ పండ్లతో కలిపి తింటే సరిపోతోంది. మొదట్లో 30-40% మొలకలు, 60-70% పండ్లు తీసుకుని, క్రమేణా మొలకల పరిమాణాన్ని పెంచుకుంటూ పోతే ఆరోగ్యంగా ఉంటారు.